పంట నమోదు పక్కాగా చేయండి

ABN , First Publish Date - 2020-07-14T10:30:31+05:30 IST

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయశాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బం ది ఈ-పంట నమోదు ఉమ్మడిగా చేపట్టాలని వ్యవ సాయశాఖ ఏడీ మాలకొండయ్య తెలిపారు.

పంట నమోదు పక్కాగా చేయండి

బొబ్బిలి రూరల్‌, జూలై 13: ఈ ఖరీఫ్‌ సీజన్‌లో  వ్యవసాయశాఖ సిబ్బంది, రెవెన్యూ సిబ్బం ది ఈ-పంట నమోదు ఉమ్మడిగా చేపట్టాలని వ్యవ సాయశాఖ ఏడీ మాలకొండయ్య తెలిపారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మాట్లాడుతూ   పంట వివరాలను సర్వేనెంబరు ప్రకారంగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఆధార్‌, మొబైల్‌ నెంబ రు, బ్యాంకు అకౌంట్‌ తప్పని సరిగా పొందు పర్చాల న్నారు. తహసీల్దార్‌ లక్ష్మణ ప్రసాద్‌, ఏవో  శ్యాం సుందరరావు, వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 


రామభ ద్రపురం: రైతులు విధిగా ఈ-క్రాప్‌ చేయించుకో వాలని ఏవో అనూరాధా పండా అన్నారు. స్థానిక వ్యవసాయ కార్యాలయంలో వీఆర్వోలు, వీఏఏలకు, సర్వేయర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ-పంట విధి విధానాలను వివరించారు.


ఏఈవో సురేష్‌, ఎంపీడీవో చిన్మమ్మలు  పాల్గొన్నారు. ఫ నెల్లిమర్ల: గ్రామాల్లో ఈ - కర్షక్‌ను పక్కాగా నమోదు చేయాలని తహసీల్దార్‌  రాము అన్నారు.   వ్యవసాయ శాఖ కార్యాలయంలో  ఈ-కర్షక్‌పై వీఆర్‌వోలు, గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ సర్వేయర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏవోకారి ఎం.పూర్ణిమ పాల్గొన్నారు. 


గంట్యాడ:  ఎంపీడీవో కార్యాల యంలోని ఈ-కర్షక్‌ యాప్‌పై  ఏవో హర్షలత అవ గాహన కల్పించారు. తహసీల్దార్‌ స్వర్ణకుమార్‌ తదితరులు ఉన్నారు.


కురుపాం: కురుపాంలో ఈ-పంటపై వ్యవసాయశాఖ, రెవెన్యూ శాఖ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్‌ ఎల్లారావు, వీఆర్వోలు, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు పాల్గొ న్నారు.


రుగుబిల్లి: రావివలససచి వాలయంలో ఈ-కర్షక్‌లో  రైతుల వివరాల నమోదుపై అవగా హన కల్పించారు. తహసీల్దార్‌ సన్యాసిశర్మ, ఏవో ఆర్‌.విజయభారతి, రెవెన్యూ, సర్వేయర్లు, వ్యవసాయ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.


సీతానగరం: ప్రతి రైతు ఈ-కర్షక్‌ (పంట నమోదు)లో తమ పేర్లును నమోదు చేసుకోవాలని ఏవో ఎస్‌.అవినాష్‌ తెలిపారు.  వీఏఏలు, వీహెచ్‌ఏలు గ్రామ రెవెన్యూ అధికారుల సమన్వయంతో   నమోదు చేపట్టాల న్నారు. 


బలిజిపేట:  వెలుగు సమావేశ మంది రంలో వీఆర్వోలు, గ్రామ వ్యవసాయ సహాయకుల కు ఈ- కర్షక్‌ నమోదుపై అవగాహన కల్పించారు. ఏవో జి.సూర్యప్రకాష్‌, హెచ్‌ డీటీ సత్య నారాయణ, వీఆర్వోలు, అగ్రికల్చరల్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 


కొత్తవలస రూరల్‌(ఎల్‌.కోట): ఎల్‌.కోట వెలుగు కార్యాలయంలో రెవె న్యూ, సర్వే, వ్యవశాయ శాఖల సిబ్బందికి ఈ-కర్షక్‌పై ఒక్కరోజు  శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏవో శ్రీనివాసరావు తెలిపారు. 


శృంగవరపుకోట రూరల్‌: తహసీల్దార్‌ కార్యాల యంలో ఈ-కర్షక్‌ నమోదుపై  వీఏఏ, వీహెచ్‌ఏ, వీఆర్‌వోలకు  ఏవో  కిరణ్‌కుమార్‌  శిక్షణ ఇచ్చారు. 


పాచిపెంట:  ఈ కర్షక్‌ యాప్‌లో తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని ఏవో బి.గోవిందరావు తెలిపారు. రెవెన్యూ , వ్యవసాయశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T10:30:31+05:30 IST