చైనా యాడ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు.. వెంటనే తొలగించిన కంపెనీ

ABN , First Publish Date - 2021-01-13T00:42:38+05:30 IST

చైనాకు చెందిన పుర్కాటన్స్ అనే కంపెనీ రూపొందించిన యాడ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఆ యాడ్‌ను అన్ని

చైనా యాడ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు.. వెంటనే తొలగించిన కంపెనీ

బీజింగ్: చైనాకు చెందిన పుర్కాటన్స్ అనే కంపెనీ రూపొందించిన యాడ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఆ యాడ్‌ను అన్ని వెబ్‌సైట్ల నుంచి సంస్థ తొలగించింది. అసలు ఈ యాడ్ వీడియోలో ఏముందంటే.. యువతి ఒంటరిగా రాత్రి సమయంలో ఓ రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది. ఓ యువకుడు ఆమెను వెంబడిస్తాడు. ఆమెను లైంగికంగా వేధించేందుకు ప్రయత్నిస్తాడు. ఇదే సమయంలో యువతి తన ముఖంపై ఉన్న మేకప్‌ను ఓ క్లాత్‌తో తుడుచుకుంటుంది. ముఖంపై ఉన్న మేకప్ పోయిన వెంటనే యువతి అబ్బాయిలా మారిపోతుంది. దీంతో ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ యాడ్‌లో యువతి మేకప్ తుడుచుకునేందుకు ఉపయోగించిన క్లాత్ పుర్కాటన్స్‌ కంపెనీకి చెందినదే. తమ సంస్థకు చెందిన క్లాత్‌ కారణంగా లైంగిక వేధింపుల నుంచి యువతి బయటపడిందనే అర్థం వచ్చేలా ఈ యాడ్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. అయితే ఈ యాడ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సంస్థ వెంటనే ఈ యాడ్‌ను అన్ని మాధ్యమాల నుంచి తొలగించింది.

Updated Date - 2021-01-13T00:42:38+05:30 IST