Abn logo
Jun 15 2021 @ 16:37PM

అదానీ గ్రూప్ స్టాక్స్‌... ‘అప్ అండ్ డౌన్’...

ముంబై : నిన్నటి(సోమవారం) భారీ పతనాల తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపించిన అదానీ గ్రూప్ స్టాక్స్‌కు గ్రహణం పట్టింది. ఈ గ్రూప్‌లోని మూడు  స్టాక్స్‌కు డౌన్ సీల్ పడ్డాయి. కాగా దీనిని ఊహించిన పరిణామంగానే భావిస్తున్నారు. కారణం... రెగ్యులర్ ట్రేడింగ్ నుంచి ‘టీ’ గ్రూప్‌లోకి ఈ  షేర్లను బదలాయిస్తారు. ‘ట్రేడ్ టూ ట్రేడ్’ సెగ్మెంట్‌లోకి షేర్లను మార్చడమంటే... అయితే డౌన్ లేకపోతే అప్ అన్నట్లుగా ట్రేడింగ్ సాగుతుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే... ఇది అన్ని షేర్ల విషయంలో జరగబోదు. 


అదానీ సంస్థ స్వయంగా తమ కంపెనీలో పెట్టుబడి పెట్టిన మూడు ఫండ్ల అక్కౌంట్లు ఫ్రీజ్ చేయలేదని సోమవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎన్‌ఎస్‌డీఎల్ కూడా ఇదే విషయమై ప్రకటన జారీ చేసింది.తాము... అల్బులా, క్రెస్టా, ఏఎంపీఎస్ ఫండ్ల అక్కౌంట్లను ఫ్రీజ్  చేయలేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ... ఇవాళ ఈ షేర్లు పతనమయ్యాయంటే... అందుకు కారణం... వీటిపై ఉన్న ప్రతికూల సెంటిమెంట్ అని చెబుతున్నారు. సమూహంగా అందరూ వేలంవెర్రిగా కొంటుంటే ఆ  కంపెనీ ఫండమెంటల్స్ గురించి పట్టించుకోరు. 


కాగా... అదానీ ట్రాన్స్‌మిషన్ రూ.1446.40 ధర వద్ద 5 శాతం డౌన్ సీల్ లాక్ చేసింది. అదానీ పవర్ రూ. 148.30 వద్ద 5 శాతం పతనమైంది. అదానీ టోటల్ గ్యాస్ కూడా ఇదే బాటలో 5 శాతం డౌన్ సీల్  పడి రూ. 1441.50 దగ్గర నిలిచింది. మిగిలిన అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఫ్లాట్‌గా, అదానీ పోర్ట్స్ ఒక శాతం నష్టపోగా, అదానీ గ్రీన్ ఎనర్జీ మాత్రం ఒ శా తం లాభపడింది. మొత్తంగా స్టాక్ మార్కెట్లలోని అనిశ్చితికి ఈ పరిస్థితి అద్దం పడుతోందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి.