Jun 18 2021 @ 23:57PM

నాని నిర్మాణంలో అదాశర్మ!

హీరో నాని నిర్మాతగా వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై రెండు సినిమాలు తెరకెక్కనున్నాయి. అందులో ‘హిట్‌ 2’ ఒకటి. రెండోది నాని సోదరి దీప్తి ఘంటా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మీట్‌ క్యూట్‌’. ఇందులో ఐదుగురు కథానాయుకలకు ఛాన్స్‌ ఉంది. ఇందులో ఓ పాత్రకు అదాశర్మ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని అదాశర్మ ‘చిత్రజ్యోతి’తో తెలిపారు. మరో నాలుగు పాత్రలకు కాజల్‌, నివేదా థామస్‌, రుహానీ శర్మ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ‘‘రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇప్పటి వరకు చేయని పాత్ర పోషిస్తున్నా. దర్శకురాలు దీప్తి కథని సింపుల్‌ వేలో చెప్పారు. ఆ నెరేషన్‌ నాకు బాగా నచ్చింది. వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో మేం టచ్‌లో ఉంటున్నాం. త్వరలో షూటింగ్‌ మొదలవుతతుందని భావిస్తున్నా’’ అని చెప్పారు అదాశర్మ.