ఫ్లిప్‌కార్ట్‌తో అదానీ గ్రూప్ ఒప్పందం..

ABN , First Publish Date - 2021-04-14T02:10:02+05:30 IST

అదానీ గ్రూప్, ఆన్‌లైన్‌ పాపింగ్‌ యాప్‌ ఫ్లిప్‌కార్ట్‌లు జట్టుకట్టాయి. కాగా... తమ మధ్య జరిగిన ఒప్పంద వివరాలను ఫ్లిప్‌కార్ట్‌ కొంతమేర ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్‌తో అదానీ గ్రూప్ ఒప్పందం..

న్యూడిల్లీ : అదానీ గ్రూప్, ఆన్‌లైన్‌ పాపింగ్‌ యాప్‌ ఫ్లిప్‌కార్ట్‌లు జట్టుకట్టాయి. కాగా... తమ మధ్య జరిగిన ఒప్పంద వివరాలను ఫ్లిప్‌కార్ట్‌ కొంతమేర ప్రకటించింది. వివరాలిలా ఉన్నాయి. రవాణా వ్యవస్థ బలోపేతానికి, వినియోగదారులకు మరింత వేగంగా సేవలనందించేందుకుగానూ ఫ్లిప్‌కార్ట్‌... అదానీ లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌తో కలసి పనిచేస్తుందని వివరించింది.


ఈ క్రమంలోనే... అదానీ కనెక్స్‌లో... ఫ్లిప్‌కార్ట్‌ ఒక డేటా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. ఇదిలా ఉంటే... ఈ ఒప్పందం విషయాన్ని అదానీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. అయితే...  ముంబౌలో ఫ్లిప్‌కార్ట్‌ కోసం 5.34 లక్షల చదరపుటడుగుల వైశాల్యమున్న గిడ్డంగులను నిర్మించి, లీజుకిచ్చేందుకు అదానీ సంస్థ నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించింది.


వచ్చే ఏడాదిలో వీటి నిర్మాణం పూర్తికానుంది. ఏ కాలంలోనైనా కోటి యూనిట్లను వీటిలో నిల్వ చేసుకునేలా ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. దీనివల్ల ఫ్లిప్‌కార్ట్‌ కూడా తన ఆన్‌లైన్‌ బిజినెస్‌ను మరింత విస్తరించుకోనుంది. ఈ లాజిస్టిక్‌ హబ్‌ వల్ల స్థానికంగా సుమారు 2,500మందికి, పరోక్షంగా వేలమందికి ఉపాధి లభించనుందని ఫ్లిప్‌కార్ట్‌ చెబుతోంది. చిన్న పరిశ్రమలకు అనుసంధానంగా ఈ హబ్‌ మారనుందని వివరించింది.


ఇదిలా ఉంటే... ఆర్‌బీఐ నిబంధనల మేరకు... ఏ విదేశీ కంపెనీ అయినా భారత కస్టమర్ల సమాచారాన్ని తప్పనిసరిగా లోకల్‌ సర్వర్లలోనే ఉంచాలి. ఈక్రమంలోనే... ఫ్లిప్‌కార్ట్‌ డేటా సెంటర్‌ను అదానీ సంస్థ ఉపయోగించుకుంటోంది. 

Updated Date - 2021-04-14T02:10:02+05:30 IST