ఆ వార్తంతా అవాస్తవం.. అదానీ గ్రూప్ స్పష్టీకరణ

ABN , First Publish Date - 2021-06-14T23:09:03+05:30 IST

అదానీ సంస్థల్లో పెట్టుబడుల పెట్టిన మూడు విదేశీ పెట్టుబడుల సంస్థల ఖాతాలను నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ నిలిపివేసినట్టు వచ్చిన వార్తలను ఆదానీ గ్రూప్ తాజాగా ఖండించింది.

ఆ వార్తంతా అవాస్తవం..  అదానీ గ్రూప్ స్పష్టీకరణ

ముంబై: అదానీ సంస్థల్లో పెట్టుబడుల పెట్టిన మూడు విదేశీ పెట్టుబడుల సంస్థల ఖాతాలను నేషనల్ సెక్యురిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ నిలిపివేసినట్టు వచ్చిన వార్తలను ఆదానీ గ్రూప్ తాజాగా ఖండించింది. ఈ వార్తలో భారీ తప్పులు ఉన్నాయని వ్యాఖ్యానించిన సంస్థ..ఇన్వెస్టర్లను తప్పుదారి పట్టించడమే ఈ వార్త లక్ష్యమని ఓ ప్రకటన విడుదల చేసింది.  ఖాతాలు స్తంభించాయన్న వార్తల కారణంగా ఆదానీ షేర్ల ధరలు బారీగా పడిపోయిన విషయం తెలిసిందే. మొత్తం విలువలో రూ. 55 వేల కోట్లకు పైగా సంపద మటుమాయమైపోయింది. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్ సంస్థలు తాజాగా ప్రకటన విడుదల చేశాయి. ఆ అకౌంట్లను నిలిపివేయలేదంటూ రిజిస్ట్రార్ అండ్ ట్రాన్ఫర్ ఏజెంట్ నుంచి అందిన లేఖ తమ వద్ద ఉందని కంపెనీ పేర్కొంది.


జాతీయ మీడియా కథనం ప్రకారం.. విదేశీ పోర్టుఫోలియో సంస్థలు, అల్బులా ఇన్వెస్ట్‌మెంట్స్, క్రెస్టా ఫండ్స్, ఏపీఎమ్ఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఫండ్స్ అదానీ గ్రూపుల్లో రూ. 43500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. మారిషన్ కేంద్రంగా ఈ కంపెనీలు ఏర్పాటయ్యాయి. అయితే నగదు అక్రమరవాణా నిరోధక చట్టం ప్రకారం ఈ కంపెనీ యాజమాన్యాల పూర్తి వివరాలను స్టాక్ మార్కెట్‌కు అందలేదని జాతీయ మీడియా పేర్కొంది. ఆ కారణంగా వాటి డీమాట్ ఖాతాలను బ్లాక్ అయిపోయినట్టు పేర్కొంది. ఈ వార్త వైరల్ అవడంతో అదానీ గ్రూపు షేర్లు భారీగా నష్టపోయాయి. కేవలం ఒక గంటలోనే ఏకంగా రూ. 55 కోట్లు కోల్పోయాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ తాజాగా ప్రకటన విడుదల చేసింది.



Updated Date - 2021-06-14T23:09:03+05:30 IST