పెట్రో కెమికల్స్‌ రంగంలోకి అదానీ

ABN , First Publish Date - 2021-08-02T05:54:45+05:30 IST

అదానీ గ్రూప్‌.. పెట్రో కెమికల్స్‌ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం అదానీ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఏపీఎల్‌) పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీ ఏర్పాటు చేసినట్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది.

పెట్రో కెమికల్స్‌ రంగంలోకి అదానీ

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌.. పెట్రో కెమికల్స్‌ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం అదానీ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఏపీఎల్‌) పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీ ఏర్పాటు చేసినట్టు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది. ఈ కంపెనీ ద్వారా రిఫైనరీలు, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌లు, ప్రత్యేక రసాయనాల తయారీ ప్రాజెక్టులు, హైడ్రోజన్‌ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్‌ నేరు గా ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతో పోటీపడబోతోంది. అదానీ గ్రూప్‌.. ఇప్పటికే రేవులు, విమానాశ్రయాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, విద్యుత్‌, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఉంది. కాగా గుజరాత్‌లోని ముంద్రా వద్ద ఒక భారీ రసాయనాల తయారీ యూనిట్‌ స్థాపన కోసం ఇప్పటికే బీఏఎ్‌సఎఫ్‌ అనే జర్మనీ కంపెనీతో అదానీ ఒప్పందం కుదుర్చుకుంది. 

Updated Date - 2021-08-02T05:54:45+05:30 IST