ప్రపంచ టాప్-20 కుబేరుల్లో గౌతమ్ అదానీ

ABN , First Publish Date - 2021-04-06T20:48:18+05:30 IST

ప్రపంచ టాప్-20 కుబేరుల్లో గౌతమ్ అదానీ

ప్రపంచ టాప్-20 కుబేరుల్లో గౌతమ్ అదానీ

న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్‌-20లో చోటు సంపాదించారు. ఫోర్బ్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచంలోని 20 మంది అత్యంత కుబేరుల్లో గౌతమ్ అదానీ ఒకరని పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలోనే సంపదను పెద్ద స్థాయిలో పెంచుకుని ప్రపంచ దిగ్గజ కుబేరుల జాబితాలో చేరిపోయారు అదానీ.


ఫోర్బ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి నాటికి గౌతమ్ అదానీ నికర సంపద 61.5 బిలియన్ డాలర్లు. ఆయన మొత్తం సంపద 80 బిలియన్ డాలర్లు అని వెల్లడించారు. ఆయనకు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల మొత్తం సంపద ఇదని తెలిపారు. కాగా, 2021లో అతి ఎక్కువ లాభాలు ఆర్జించిన వ్యక్తుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు అదానీ. ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న అమేజాన్ అధినేత జెఫ్ బజోస్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌ల కంటే కూడా ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించిన వ్యక్తిగా అదానీ రికార్డు సృష్టించారు.

Updated Date - 2021-04-06T20:48:18+05:30 IST