అదానీ విల్మార్‌ భారీ ఐపీఓ!

ABN , First Publish Date - 2021-03-20T06:27:41+05:30 IST

అదానీ గ్రూపు నుంచి మరో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఫార్చూన్‌ బ్రాండ్‌ పేరుతో వంట నూనెలు, బాస్మతి బియ్యం అమ్మే అదానీ విల్మా ర్‌ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియ కోసం కంపెనీ

అదానీ విల్మార్‌ భారీ ఐపీఓ!

రూ.5000 కోట్లు సమీకరణ


అదానీ గ్రూపు నుంచి మరో కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఫార్చూన్‌ బ్రాండ్‌ పేరుతో వంట నూనెలు, బాస్మతి బియ్యం అమ్మే అదానీ విల్మా ర్‌ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.5,000 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రక్రియ కోసం కంపెనీ ఇప్పటికే జేపీ మోర్గాన్‌, కోటక్‌ మహీంద్ర క్యాపిటల్‌ కంపెనీలను సలహాదారులుగా నియమించినట్టు సమాచారం. అయితే దీనిపై కంపెనీగానీ, సలహాదారులుగానీ అధికారికంగా ఎలాంటి  ప్రకటనా చేయడం లేదు. ఈ వార్తలు నిజమైతే అదానీ విల్మార్‌ ఆ గ్రూపు నుంచి పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన ఏడో కంపెనీ అవుతుంది. 


వచ్చే వారమే బార్బిక్యూ ఐపీఓ:  ఫాస్ట్‌ఫుడ్‌ రెస్టారెంట్‌ చెయిన్‌ బార్బిక్యూ నేషన్‌ వచ్చే వారం ఐపీఓకు వస్తోంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.700 కోట్లు సమీకరించనుంది. ఈ కంపెనీలో రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాతో పాటు పలు పీఈ సంస్థలూ ఇన్వెస్ట్‌ చేశాయి. 


మణప్పురం ఫైనాన్స్‌ రూ.6,000 కోట్ల సమీకరణ

ప్రముఖ గోల్డ్‌ లోన్స్‌ ఫైనాన్స్‌ కంపెనీ మణప్పురం ఫైనాన్స్‌ ఎన్‌సీడీల జారీ ద్వారా  వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) రూ.6,000 కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. శుక్రవారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ ఎన్‌సీడీలను క్యూఐపీ లేదా పబ్లిక్‌ ఇష్యూ పద్దతిలో జారీ చేయాలని కంపెనీ భావిస్తోంది. 


లాభాలతో లిస్టయిన ఈజీ ట్రిప్‌ ఐపీఓ

ఇటీవల పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌ కంపెనీ షేర్లు తొలి రోజే లాభాలు నమోదు చేశాయి. ఒక్కోటి రూ.187 ధరతో జారీ చేసిన ఈ షేర్లు బీఎ్‌సఈలో రూ.206 వద్ద లిస్టయ్యాయి. చివరికి 11.39 శాతం లాభంతో రూ208.30 వద్ద క్లోజయ్యాయి. 

Updated Date - 2021-03-20T06:27:41+05:30 IST