మా ఊరికి చేర్చండి

ABN , First Publish Date - 2020-08-14T10:03:23+05:30 IST

ఆలూరు పట్టణం కొత్త బస్టాండు సమీపంలో ఓ వృద్ధురాలు 10 రోజులుగా కూర్చుని ఉంది. తనది కౌతాళం అని, తమ గ్రామానికి పంపించాలని కన్నీటి

మా ఊరికి చేర్చండి

 ఆలూరులో రోడ్డుపైనే  వృద్ధురాలు 


ఆలూరు, ఆగస్టు 13: ఆలూరు పట్టణం కొత్త బస్టాండు సమీపంలో ఓ వృద్ధురాలు 10 రోజులుగా కూర్చుని ఉంది. తనది కౌతాళం అని, తమ గ్రామానికి పంపించాలని కన్నీటితో వేడుకుంటోంది. ఆమె పరిస్థితిని గమనించిన శివనాయక్‌ అనే కానిస్టేబుల్‌ తన సొంత ఖర్చులతో ఆటో ఏర్పాటు చేసి ఆదోనికి పంపినా అక్కడి నుంచి కౌతాళానికి ఎవరూ బస్సులో, ఆటోలో ఎక్కించుకోకపోవడంతో తిరిగి ఆలూరుకు చేరుకుంది. రోడ్డు పక్కనే అనాఽథలా ఉన్న ఆ వృద్ధురాలికి టిఫిన్‌, టీ అందిస్తున్నారు. తమ వాళ్ల దగ్గరకు చేర్చాలని ఆ వృద్ధురాలు వేడుకుంటోంది.

Updated Date - 2020-08-14T10:03:23+05:30 IST