ఇంటి పన్ను వసూళ్లలో అద్దంకి టాప్‌ !

ABN , First Publish Date - 2021-04-21T05:44:46+05:30 IST

ముందస్తు ఇంటి ప న్ను వసూళ్లలో అద్దంకి నగర పంచాయతీ ము ందంజలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో ‘టాప్‌’ లే పింది. 20 రోజుల్లో రూ.88లక్షలు వసూలు చేసి ప్రథమ స్థానంలో ఉంది. 2021-22 ఆర్థిక సంవ త్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు ఏప్రిల్‌ లో చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందే అవకా శాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో అన్ని ప్రా ంతాల్లోనూ గృహ యజమానులు పన్నుల చె ల్లింపునకు ఉత్సాహం చూపుతున్నారు.

ఇంటి పన్ను వసూళ్లలో అద్దంకి టాప్‌ !
అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం

రాష్ట్రంలోనే ప్రథమ స్థానం 

20 రోజుల్లో రూ.88లక్షలు వసూలు

ఐదు శాతం పన్ను రాయితీతో చెల్లింపుల్లో పెరిగిన వేగం 

జిల్లాలోని 8 పట్టణాల్లో రూ. 6.76 కోట్లు వసూలు 


అద్దంకి, ఏప్రిల్‌ 20 : ముందస్తు ఇంటి ప న్ను వసూళ్లలో అద్దంకి నగర పంచాయతీ ము ందంజలో నిలిచింది. రాష్ట్ర స్థాయిలో ‘టాప్‌’ లే పింది. 20 రోజుల్లో రూ.88లక్షలు వసూలు చేసి ప్రథమ స్థానంలో ఉంది. 2021-22 ఆర్థిక సంవ త్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు ఏప్రిల్‌ లో చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందే అవకా శాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో అన్ని ప్రా ంతాల్లోనూ గృహ యజమానులు పన్నుల చె ల్లింపునకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో జిల్లాలోని ఎనిమిది పట్టణ  సంస్థల పరిధిలో ఈనెల 1నుంచి మంగళవారం సాయంత్రం వర కూ సుమారు రూ.6.76 కోట్లు వసూలయ్యాయి. అందులో ఒంగోలు కార్పొరేషన్‌లో రూ.3.03 కో ట్లు ఉన్నాయి. చీరాల మున్సిపాలిటీ నుంచి రూ. 1.08 కోట్లు, అద్దంకి నగరపంచాయతీలో 88 ల క్షలు, మార్కాపురం మున్సిపాలిటీలో 51 లక్షలు వసూలయ్యాయి.  గిద్దలూరు నగర పంచాయ తీలో రూ. 41 లక్షలు, కనిగిరి నగర పంచాయ తీలో రూ.36లక్షలు,  కందుకూరు మున్సిపాలి టీలో రూ.30లక్షలు, చీమకుర్తి నగరపంచాయ తీలో రూ.20లక్షలు వచ్చాయి. అయితే ప్రభు త్వం నిర్దేశించిన లక్ష్యం ప్రకారం చూస్తే అద్దంకి నగర పంచాయతీ జిల్లాలోని మిగిలిన  మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకంటే చాలా ముందంజలో ఉంది.  20రోజుల్లో లక్ష్యం రూ.34 లక్షలు కాగా రూ.88 లక్షలు (261.70శాతం) వ సూలు చేసింది. దీంతో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచింది. జిల్లాలోని మిగిలిన పట్టణ సంస్థలు టాప్‌టెన్‌ లో చోటు దక్కించుకోలేకపోయాయి. జిల్లావర కు చూస్తే 120.40 శాతంతో చీరాల రెండో స్థా నం,  114.90 శాతంతో గిద్దలూరు 3వ స్ధానం, 95.70 శాతంతో కనిగిరి 4వ స్థానం,  79.30 శా తంతో మార్కాపురం 5వ స్థానంలో ఉన్నాయి. 69.90 శాతంతో ఒంగోలు 6వ స్థానం, 68.50 శాతంతో  చీమకుర్తి 7వ స్థానం, 38.50 శాతం వసూలుతో కందుకూరు మున్సిపాలిటీ చివరిస్థా నంలో నిలిచాయి. 


Updated Date - 2021-04-21T05:44:46+05:30 IST