Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 13:37PM

కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మారిస్తే..: అద్దంకి దయాకర్‌

హైదరాబాద్: తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్‌నేత అద్దంకి దయాకర్‌ విమర్శించారు. సోమవారం ఆయన గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మారిస్తే.. మంత్రి కేటీఆర్ డ్రగ్స్ రాష్ట్రంగా మారుస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యం, డ్రగ్స్ పంచుతున్నారని, ఐపీఎస్‌ అధికారి అకున్ సభర్వాల్ కమిటీ ఏమైందని ప్రశ్నించారు. ఈడీ విచారణకు రానా, రకుల్ ప్రీత్‌సింగ్‌ ఎందుకు వచ్చారన్నారు. వైట్ చాలెంజ్‌తో తెలంగాణ నుంచి డ్రగ్స్‌ను తరిమి కొడతామని అద్దంకి దయాకర్‌ పేర్కొన్నారు. వైట్ ఛాలెంజ్‌ను స్వీకరించిన మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.


డ్రగ్స్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇరువురు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్  బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్‌ను మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్సెప్ట్ చేశారని.... మంత్రి కేటిఆర్ కోసం మధ్యాహ్నం 12 గంటలకు అమర వీరుల స్తూపం దగ్గర వెయిట్ చేస్తామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement