Abn logo
Sep 30 2021 @ 13:42PM

ఆదర్శంగా ఉండాల్సిన నేతలు బూతులు మాట్లాడటం సరికాదు: అద్దంకి ఎమ్మెల్యే

ప్రకాశం: ఏపీలో మంత్రులు బూతు పురాణం మొదలుపెట్టారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలు ఆ విధంగా మాట్లాడటం సరికాదని తెలిపారు. ఆ సంస్కృతిని అలవాటు చేస్తే రాబోయే తరాలకు చెడు మార్గాన్ని చూపించినట్లు అవుతుందని అన్నారు. రాజకీయం అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలే కానీ చీదర తెప్పించకూడదన్నారు. టీవీ పడితే మనం ఏమి చేస్తున్నామో తెలియాలని...కానీ ఇప్పుడు మాత్రం టీవీలు పెడితే నలుగురు కుటుంబ సభ్యులు మన నాయకులు ఏమి మాట్లాడుతున్నారో చూడలేని పరిస్థితికి రావటం మన దౌర్భాగ్యమని గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. 

ఇవి కూడా చదవండిImage Caption