సకాలంలో పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-06-18T05:14:15+05:30 IST

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.

సకాలంలో పనులు పూర్తి చేయాలి
అయిజలో అధికారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

- అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష  

అయిజ, జూన్‌ 17 : అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. అయిజ మునిసి పాలిటీలో గురువారం చైర్మన్‌ దేవన్నతో కలిసి పర్యటించారు. ఉప్పలదొడ్డి పేట వంతెన నిర్మాణానికి రూ.3 కోట్లు, తూముకుంట బైపాస్‌ వంతెన నిర్మాణానికి రూ.3 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వంతెన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అధికారులకు సూచనలు, సలహాలు, చేయాల్సిన పనులను నిర్దేశించారు. అనంతరం కర్నూల్‌, రాయిచూర్‌ రహదారిని పరిశీలించారు. మొక్కలు నాటేందుకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ వేణుగోపాల్‌, మేనేజర్‌ రాజేష్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ మన్సూర్‌ రెహమాన్‌, మహేష్‌, అధికారులు లక్ష్మన్న, అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు. 


రోడ్ల వెంట మొక్కలు నాటాలి 

వడ్డేపల్లి : హరితహారంలో భాగంగా ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటాలనీ అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. హరితహారంపై వడ్డేపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బల్గెర నుంచి అలంపూర్‌ చౌరస్తా వరకు రోడ్డు పక్కన ఆరు ఫీట్ల మొక్కలను నాటాలనీ సూచించారు. వాటికి కంచెలను ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో ఉమాదేవి, నాగేంద్ర, ఎంపీడీఓలు రవీంద్ర, సాయిప్రకాశ్‌, రమణరావు, భాస్కర్‌, నరసింహారెడ్డి, పద్మావతి, ఆంజనేయరెడ్డి, కార్యదర్శులు పాల్గొన్నారు.


పనులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు

అలంపూరు : అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను  హెచ్చరించారు. అలంపూరు లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను గురు వారం ఆయన పరిశీలించారు. ముందుగా అక్బర్‌ పేట కాలనీలో రూ.60లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో, మునిసిపల్‌ కార్యాలయాలను తనిఖీ చేశారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్బర్‌పేటలో నిర్మాణం లో ఉన్న సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపించిం చిందని కాలనీవాసులు ఫిర్యాదు చేయడంతో అధి కారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ రాజు, ఎంపీడీఓ సుగుణకుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T05:14:15+05:30 IST