పల్లెప్రకృతి వనాలను పరిశీలించిన అడిషనల్‌ కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-10-24T06:38:24+05:30 IST

మండల కేంద్రంతో పాటు గొల్లమాడ గ్రామంలో బృహత్‌పల్లె ప్రకృతి వనాలను అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే పరిశీలించారు.

పల్లెప్రకృతి వనాలను పరిశీలించిన అడిషనల్‌ కలెక్టర్‌
గొల్లమాడ గ్రామంలో ప్రకృతివనాన్ని పరిశీలిస్తున్న అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే

నర్సాపూర్‌(జి), అక్టోబరు 23 : మండల కేంద్రంతో పాటు గొల్లమాడ గ్రామంలో బృహత్‌పల్లె ప్రకృతి వనాలను అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే పరిశీలించారు. శనివారం గొల్లమాడ గ్రామంలో పది ఎకరాల్లో, మండల కేంద్రంలో నాటిన మొక్కలను చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అర్గుమీది రాంరెడ్డి, చెన్నమహేష్‌, యంపీడీవో ఉషారాణి, ఎంపీవో శ్రీనివాస్‌ గౌడ్‌, కార్యదర్శులు నరేష్‌ కుమార్‌, వీణ ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-10-24T06:38:24+05:30 IST