Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

సమయపాలన పాటించని అధికారులపై ఆగ్రహం

టేక్మాల్‌, డిసెంబరు 6 : సమయ పాలన పాటించని అధికారులపై అదనపు కలెక్టర్‌ ప్రతిమాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని టేక్మాల్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో వ్యాక్సినేషన్‌ ఎంతవరకు వేశారని అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరికీ తప్పకుండా రెండో డోస్‌ అందేలా చూడాలన్నారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే సమయానికి అధికారులు ఎవరూ లేకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. అనంతరం మండలంలోని పల్వంచ గ్రామ ప్రైమరీ సెంటర్‌ను తనిఖీ చేశారు. ఏఎన్‌ఎం లేకపోవడంతో అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. కుసంగి, బొడ్మట్‌పల్లి వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ను తనిఖీ చేశారు. అధికారులందరూ సమయపాలన పాటించాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

Advertisement
Advertisement