Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాక్సినేషన్‌ శిబిరాలను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి టౌన్‌, డిసెంబరు 6: కామారెడ్డి పట్టణంలోని 28, 29వ వార్డుల్లో ఏర్పా టు చేసిన కరోనా వ్యాక్సినేషన్‌ ప్రత్యేక శిబిరాలను సోమవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే పరిశీలించారు. త్వరితగతిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమా న్ని పూర్తి చేయాలని వైద్యులను ఆదేశించారు. వ్యాక్సిన్‌ వేసుకోని వారిని గుర్తించి అర్హులందరికీ వ్యాక్సినేషన్‌ చేసే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కా మారెడ్డి మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌, మెప్మాపీడీ శ్రీధర్‌రెడ్డి, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement