జాతర ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-25T04:15:27+05:30 IST

మండలంలోని గంగాపూర్‌ గ్రామశివారులో పౌర్ణమిరోజున నిర్వహించే గంగాపూర్‌ జాతర ఏర్పాట్లను సోమవారం అదనపుకలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి పరిశీలించారు.

జాతర ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్‌
ఆలయ ప్రాంగణంను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి

రెబ్బెన, జనవరి 24: మండలంలోని గంగాపూర్‌ గ్రామశివారులో పౌర్ణమిరోజున నిర్వహించే గంగాపూర్‌ జాతర ఏర్పాట్లను సోమవారం అదనపుకలెక్టర్‌ వరుణ్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను త్వరగా పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచిం చారు. ఎంపీపీ సౌందర్య, సర్పంచ్‌ వినోద, ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, ఎంపీవో అంజద్‌పాషా, డీఈఈ, ఏఈ, ఆలయ ఈవో బాపురెడ్డి, కార్యదర్శి మురళీ, నాయకులు  పాల్గొన్నారు.

స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి

తిర్యాణి: యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి అన్నారు. సోమ వారం మండలంలో ఖాదీవిలేజ్‌ ఇండస్ట్రీస్‌ కమిషన్‌ (కేవీఐసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తేనెటీగల పెంప కంపై ఐకేపీ కార్యాలయంలో ఇస్తున్న శిక్షణకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తేనెటీగల పెంపకం ద్వారా తేనెను సేకరించి మార్కెట్లో అమ్మితే మంచి ఆదాయం సమకూరుతుందన్నారు. ఆసక్తిగల వారికి ఐదు రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పది తేనెటీగల బాక్సులను ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సర్పంచ్‌లు సింధుజ, డీఆర్డీవో పీడీ సురేందర్‌, డీపీఎం రామకృష్ణ, ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌ ఉన్నారు.

పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి

ఆసిఫాబాద్‌ రూరల్‌: విద్యావాలంటీర్ల పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలని సోమవారం విద్యావాలంటీర్ల సంఘం నాయకులు అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019-20విద్యా సంవత్సరంలో జనవరి, ఫిబ్రవరి, మార్చినెల వేతనాలు ఇప్పటి వరకు రాలేద న్నారు. కరోనా సమయంలో కూడా వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. ఇప్పటి కైనా వేతనాలు అందజేయాలని కోరారు. కార్యక్ర మంలో వీవీల సంఘం నాయకులు ధర్మారావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T04:15:27+05:30 IST