కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలకు అదనపు అధికారాలు

ABN , First Publish Date - 2020-08-15T10:00:35+05:30 IST

రాష్ట్రంలోని పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌ మాస్టర్ల అధికారాలపై ..

కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలకు అదనపు అధికారాలు

టీచర్ల జీతాల చెల్లింపులోనూ నిర్ణయం తీసుకునే వీలు


హైదరాబాద్‌, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌ మాస్టర్ల అధికారాలపై పాఠశాల విద్యాశాఖ ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల హెచ్‌ఎంల సాధారణ, ఆకస్మిక సెలవులతో పాటు హెచ్‌ఎంలు, టీచర్ల వేతనాల చెల్లింపు, ఇంక్రిమెంట్‌ మంజూరు అధికారాలను స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలకు కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎ.దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు.


తమ స్కూళ్ల పరిధిలోని టీచర్ల సాధారణ, ఆకస్మిక సెలవుల విషయాన్ని హెచ్‌ఎంలు స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. టీచర్ల ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కేల్స్‌, ఫే ఫిక్సేషన్‌, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, పెన్షన్‌ మంజూరు, తదితర అంశాలు  కాంప్లెక్స్‌ హెచ్‌ఎంల ద్వారా ఎంఈవోకు ప్రతిపాదనలు పంపాలని వివరించారు. ఎంఈవో ఉత్తర్వుల ఆధారంగా స్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు బిల్లులు క్లైం చేసి.. చెల్లింపులు చేస్తారని తెలిపారు.

Updated Date - 2020-08-15T10:00:35+05:30 IST