Abn logo
May 11 2021 @ 01:15AM

అడిషనల్‌ కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

బాసర, మే, 10 :  బాసర మండంలోని దోడాపూర్‌ గ్రామాన్ని సోమవారం అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కాడే సందర్శించారు. ఆకస్మికంగా వచ్చిన అడిషనల్‌ కలెక్టర్‌ గ్రామంలో తనిఖీ నిర్వహించారు. గ్రామంలో పర్యటించి పారి శుధ్యం తాగునీటి వసతులు వంటి మౌలిక వసతుల సౌకర్యాలను పరి శీలించారు. గ్రామ పంచాయతీలో రికార్డుల నిర్వాహణపై ఆరా తీశారు. కరోనా, ముందు జాగ్రత్తల చర్యలపై గ్రామస్తులకు అవగాహన కల్పించాలని గ్రామ సర్పంచ్‌కు సూచించారు. పారిశుధ్యం లోపం లేకుండా హైపోక్లోరైడ్‌ ద్రావ ణాన్ని చల్లుతూ ఉండాలని సూచించారు. 


Advertisement
Advertisement