ఖాకీల విధులకు అధికార నేత ఆటంకం

ABN , First Publish Date - 2021-06-15T06:36:15+05:30 IST

మార్కాపురం పట్టణంలో ఖాకీలపై అధికారపార్టీ నాయకుల పెత్తనం ఎక్కు వైంది. దీంతో ఖర్ఫ్యూ సమ యంలో నిబంధనలు అ మలు చేయడంలో వారు విఫలమవు తున్నారు.

ఖాకీల విధులకు అధికార నేత ఆటంకం
పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలు

కర్ఫ్యూ సడలింపులో రోడ్లపై 

యథేచ్ఛగా ద్విచక్ర వాహనదారులు

సీజ్‌ చేసిన వాటిని ఇచ్చేయాలంటూ ఒత్తిడి  

మార్కాపురం, జూన్‌ 14: మార్కాపురం పట్టణంలో ఖాకీలపై అధికారపార్టీ నాయకుల పెత్తనం ఎక్కు వైంది. దీంతో ఖర్ఫ్యూ సమ యంలో నిబంధనలు అ మలు చేయడంలో వారు విఫలమవు తున్నారు. కరో నా కట్టడికి ప్రభుత్వ ఆదేశాల మేరకు విధులు నిర్వ హించడానికి వెనుకడుగు వేస్తున్నారు. చేసిన పనికి గు ర్తింపు లేకపోగా రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి వస్తుండ టంతో కింది స్థాయి పోలీస్‌ సిబ్బంది కూడా మనకెందుకులే అన్న ధోరణికి వస్తున్నారు.

మార్కాపురం పట్టణంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూని సడలిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. కర్ఫ్యూ సమయంలో ఎస్సై కిశోర్‌, ట్రైనీ ఎస్సై అరుణ జ్యోతి ప్రధాన కూడళ్లలో ముఖ్యంగా కంభం బ స్టాండ్‌, కోర్టు సెంటర్‌, దోర్నాల బస్టాండ్‌ వద్ద తనిఖీలు చేస్తున్నా రు. రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనా లను అదుపులోకి తీసుకుంటున్నారు. రోజుకు 70 నుంచి 80 వాహనాలను అదుపులోకి తీసుకుంటున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలను అదుపులోకి తీసుకున్నారో? లేదో? మరుక్షణమే అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సంబంధిత వ్యక్తిని వదిలిపెట్టాలంటూ ఖద్దరు నాయకుల ఫోన్లు మొదలవుతాయి. వదలాలా? వద్దా? వదలకపోతే నాయకుడు ఏమనుకుంటారో? వదిలితే ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ రోజువారీ ఇచ్చిన లక్ష్యం ఎలా పూర్తవుతుంది? అన్న సంశయంతో కింది స్థాయి సిబ్బంది కొట్టుమి ట్టాడుతున్నారు. 

ఎస్పీ దృష్టికి..

మార్కాపురం పట్టణంలో అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు పట్టణ పోలీసులపై జిల్లాలో ఒక మంత్రికి ఫిర్యాదు కూడా చేశారు. సదరు మంత్రి ఆ నాయకుడు చెప్పిందే తడువుగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌కు ఫోన్‌లో సిఫార్సు చేసినట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఎస్పీ మాత్రం నిబంధనలను అమలు చేయడంలో రాజీ లేదని చెప్పినట్లు తెలిసింది. 

Updated Date - 2021-06-15T06:36:15+05:30 IST