Jul 30 2021 @ 06:03AM

అధీరా

సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘కేజీఎఫ్‌: ఛాప్టర్‌ 2’. యష్‌ కథానాయకుడు. ప్రశాంత్‌ నీల్‌ దర్శకుడు. ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1’కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ విలన్‌ పాత్రను పోషిస్తున్నారు. గురువారం (జూన్‌ 29)న ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ చిత్రంలో ఆయన న్యూ లుక్‌ను విడుదల చేశారు. భుజాలపై భారీ ఖడ్గం పెట్టుకొని వెనుక కేజీఎఫ్‌ సామ్రాజ్యం అంతా కలసిరాగా ఠీవీగా నడుచుకుంటూ వస్తున్న సంజయ్‌దత్‌ లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. ఈ లుక్‌ను షేర్‌ చేస్తూ ‘యుద్ధం పురోగతి కోసమే అందరం ఈ విషయాన్ని అంగీకరించాల్సిందే’ అని ప్రశాంత్‌నీల్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రంలో యష్‌, సంజయ్‌దత్‌పై చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు ప్రత్యేకాకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం తెలిపింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. శ్రీనిధి కథానాయిక. ప్రకాశ్‌రాజ్‌, రవీనా టాండన్‌, రావు రమేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వి. కిరగందూర్‌ నిరిస్తున్నారు.