అదిగదిగో..వెలుగుజిలుగుల యాదాద్రి

ABN , First Publish Date - 2021-06-22T06:49:17+05:30 IST

ప్రాచీన కాలం నాటి శిల్పకళారీతులతో అద్భుత ఆధ్యాత్మిక కళాఖండంగా రూపుదిద్దుకుంటున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రత్యేక విద్యుద్దీపాల పసిడి కాంతుల నడుమ సీఎం కేసీఆర్‌ సోమవారం వీక్షించారు.

అదిగదిగో..వెలుగుజిలుగుల యాదాద్రి
విద్యుత్‌ వెలుగుల్లో యాదాద్రి

యాదాద్రిని వీక్షించిన సీఎం

బాలాలయంలో ప్రత్యేక పూజలు

రింగురోడ్డు పనుల పరిశీలన

ఇంకెంతకాలం పనులుచేస్తారని ఆగ్రహం

రింగ్‌రోడ్డు లోపల ప్రైవేట్‌ ఆస్తులు ఉండవద్దు

ప్రధాన ఆలయ లైటింగ్‌పై అసంతృప్తి

ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్‌


యాదాద్రి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రాచీన కాలం నాటి శిల్పకళారీతులతో అద్భుత ఆధ్యాత్మిక కళాఖండంగా రూపుదిద్దుకుంటున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ప్రత్యేక విద్యుద్దీపాల పసిడి కాంతుల నడుమ సీఎం కేసీఆర్‌ సోమవారం వీక్షించారు. వరంగల్‌ జిల్లా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. తొలుత బాలాలయంలో సీఎంకు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన అష్టభుజి ప్రాకార మండపాలు, సప్తగోపురాల సముదాయానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్‌ను పరిశీలించారు. ఇండోర్‌లో ప్రత్యేకంగా రూపొందించిన లోహపు దర్శన క్యూలైన్లను, ప్రధానాలయం అంతర్‌ప్రాకార మండపం, ముఖ మండపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం కొండపై నూతనంగా నిర్మించిన అతిథి గృహంలో అధికారులతో సమావేశమై ఆలయ పనుల పురోగతి పై సమీక్షించారు. ఆలయ పనుల జాప్యంపై అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానాలయ అంతర్‌ప్రాకార మండపం నుంచి గోపురాలకు ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపకాంతులపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎంతో గొప్పగా ఆశించామని, ఇదేం లైటింగ్‌ అని ఆర్కిటెక్‌ ఆనందసాయిని ప్రశ్నించిన ట్టు సమాచారం. బస్‌ టర్మినల్‌ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని, అందుకు రూ.3కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అదేవిధంగా రింగ్‌రోడ్డు లోపల ఎలాంటి ప్రైవేట్‌ ఆస్తులు, స్థలాలు లేకుండా ఆలయ పరిసరాలను పూర్తిగా పవిత్ర స్థలంగా తీర్చిదిద్దాలని సూచించారు. సీఎం వెంట మంత్రి జగదీ్‌షరెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎంపీ సంతో్‌ష, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్‌, భూపాల్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-06-22T06:49:17+05:30 IST