Abn logo
Apr 8 2021 @ 10:54AM

ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ఆదిలాబాద్: జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు బోథ్‌లో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. వ్యాపార సంస్థలు మధ్యాహ్నం నుంచి మూసివేయనున్నారు. అలాగే నిర్మల్‌ జిల్లాలో ఒక్క రోజే 359 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఆసిఫాబాద్‌ జిల్లా, లింగాపూర్ మండలంలో గత 24 గంటల్లో 103 మందికి పాజిటివ్ వచ్చింది. మంచిర్యాల జిల్లాలో కొత్తగా 180 మందికి కరోనా సోకింది. గత 4 రోజుల్లో 458 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement