ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-19T16:40:05+05:30 IST

ఆదిలాబాద్: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది.

ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆదిలాబాద్: ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో కరోనా థర్డ్ వేవ్ కరాళ నృత్యం చేస్తోంది. ప్రతి రోజు వందల్లో కేసులు నమోదవుతున్నాయి. మరీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. సింగరేణి కార్మికులతోపాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారు.


ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. గత పక్షం రోజులుగా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంచిర్యాల జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. థర్డ్ వేవ్‌లో పాజిటీవ్ రేటు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్లస్టర్, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రి, మొబైల్ టెస్టింగ్ సెంటర్లతోపాటు సింగరేణి ఏరియా ఆస్పత్రుల్లో ఒకే రోజు ఏకంగా 451 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఒకేసారి కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.

Updated Date - 2022-01-19T16:40:05+05:30 IST