Adilabad: రిమ్స్ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకాల దందా

ABN , First Publish Date - 2021-08-04T17:12:05+05:30 IST

జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకాల దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టాఫ్ నర్సు ఉద్యోగం కావాలంటే రూ.1.50 లక్షలకు కట్టాలని

Adilabad: రిమ్స్ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకాల దందా

ఆదిలాబాద్: జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల అమ్మకాల దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టాఫ్ నర్సు ఉద్యోగం కావాలంటే రూ.1.50 లక్షలకు కట్టాలని నిరుద్యోగులతో దళారులు బేరసారాలు చేస్తున్నారు. బేరసారాలు చేసిన ఆడియో లీకై వాట్సాప్ వేదికగా వైరలైంది. దీంతో బాధితులు రిమ్స్ డైరెక్టర్‎కు ఫిర్యాదు చేశారు. రిమ్స్ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

Updated Date - 2021-08-04T17:12:05+05:30 IST