Abn logo
Aug 2 2020 @ 18:04PM

ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

ఆదిలాబాద్ : నగరంలోని రిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ బలరాం నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆస్పత్రిలో సౌకర్యాలు లేకపోయినా పని చేస్తున్నామన్నారు. అయితే ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టుల భర్తీని స్థానిక నేతలు అడ్డుకుంటున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వైద్యుల పోస్టులను కూడా భర్తీ కానివ్వడం లేదని.. నేతల జోక్యం పెరగడంతో ఏమీ చేయలేకపోతున్నామన్నారు.


అందుబాటులో ఉన్న వనరులతోనే సేవలు అందిస్తున్నామని బలరాం మీడియాకు వెల్లడించారు. ఈయన ఆరోపణలపై స్థానిక నేతలు, జిల్లా ఉన్నతాధికారులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే.. రిమ్స్ కోవిడ్ వార్డులో రోగుల పట్ల అధికారుల నిర్లక్షం చూపిస్తున్నారు. దీంతో 10 మంది కరోనా బాధితులు వార్డు నుంచి పరారయ్యారు.

Advertisement
Advertisement
Advertisement