Advertisement
Advertisement
Abn logo
Advertisement

మంత్రి ఆదిమూలపు దంపతుల ఆదాయం కేసులో తీర్పు రిజర్వ్

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులపై దాఖలైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు....120 మందికి పైగా సాక్షులను విచారణ చేశామని, 5 వందలకు పైగా దస్తవేజులను పరిశీలించామని తెలిపారు. దర్యాప్తు చివరి దశకు వచ్చిందని, 3 నెలల్లో దర్యాప్తు పూర్తి అవుతుందని  చెప్పారు. ఈ సమయంలో ప్రాథమిక విచారణ జరపమని చెప్పవద్దని విజ్ఞప్తి చేశారు. విచారణ పూర్తి చేసిన తర్వాత ఛార్జ్ షీట్ నివేదిక అందజేస్తామన్నారు. నివేదికను పరిశీలించి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవచ్చునని సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement