ఆదినారాయణ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2021-06-18T02:46:15+05:30 IST

పోస్టల్‌శాఖలో కార్మికుల సంక్షేమం కోసం కామ్రేడ్‌ ఆదినారాయణ చేసిన సేవలను మరువలేమని ఎన్‌ఎఫ్‌పీఈ నా

ఆదినారాయణ సేవలు మరువలేనివి
ఆదినారాయణ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న పోస్టల్‌ ఉద్యోగులు

గూడూరురూరల్‌, జూన్‌ 17: పోస్టల్‌శాఖలో కార్మికుల సంక్షేమం కోసం కామ్రేడ్‌ ఆదినారాయణ చేసిన సేవలను మరువలేమని ఎన్‌ఎఫ్‌పీఈ నాయకుడు గోవింద్‌నాయక్‌ అన్నారు. గురువారం స్థానిక పోస్టాఫీస్‌లో ఆదినారాయణ వర్థంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్‌ విభాగంలో ట్రేడ్‌యూనియన్‌కి జనరల్‌ సెక్రటరీగా ఆదినారాయణ ఎన్నో సమస్యలను పరిష్కరించారన్నారు. కార్యక్రమంలో సుధాకర్‌రాజు, హేమలత, ఫీరోజ్‌, శ్రీనివాసులు, రవీంద్ర, రాము, సురేష్‌, సుధీర్‌బాబు, సువర్ణ, శరణ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-18T02:46:15+05:30 IST