Oct 24 2021 @ 08:50AM

ప్రభాస్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేసిన 'ఆదిపురుష్'..?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23. ఈ రోజు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. తమ డార్లింగ్ నటిస్తున్న పాన్ ఇండియన్, పాన్ వరల్డ్ సినిమాల నుంచి అదిరిపోయే సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ వస్తాయని. కానీ ఎప్పటిలాగే వారికి నిరాశే మిగిలిందని టాక్ వినిపిస్తోంది. 'రాధే శ్యామ్' సినిమా నుంచి ప్రభాస్ పాత్రను రివీల్ చేస్తూ టీజర్ వదిలింది చిత్రబృందం. ఇందులో విక్రమాదిత్య ఎవరో ..ఏం చేస్తాడో మేకర్స్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వదిలిన టీజర్‌లో క్లారిటీ ఇచ్చారు. ఇది నిజంగా అభిమానులు గానీ..ప్రేక్షకులు గానీ ఊహించనిది. ప్రభాస్ పోషిస్తున్న విక్రమాదిత్య పాత్ర ఇంత సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని ఊహించలేదు. ఈ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

కానీ ప్రభాస్ నటిస్తున్న 'ఆది పురుష్' మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్ విషయంలో మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యారట. ఇది ప్రభాస్‌కు స్ట్రైట్ హిందీ సినిమా. ఆయన ఈ ఇందులో రాముడుగా నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ ఈ మూవీని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఇందులో సీత పాత్ర, లంకేశ్ పాత్ర పోషిస్తున్న కృతి సనన్, సైఫ్ అలీఖాన్‌లు తమ షూటింగ్ పూర్తి చేసి వెళ్ళిపోయారు. అంటే దాదాపు షూటింగ్ సగానికి పైగానే పూర్తయినట్టు. అందుకే 'ఆదిపురుష్' మూవీ నుంచి ప్రభాస్ రోల్‌కు సంబంధించిన టీజర్ వదులుతారని ఆశపడ్డారు అభిమానులు. కానీ జస్ట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసి విషెస్ చెప్పడం తీవ్ర నిరాశకి గురి చేసింది. చూడాలి మరి త్వరలోనైనా ఈ మూవీ నుంచి నుంచి ఏదైనా సర్‌ప్రైజ్ వస్తుందేమో.