Sep 26 2021 @ 23:52PM

రామలక్ష్మణుల సెల్ఫీ

రామాయణం ఆధారంగా దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్‌’ చిత్రంలో శ్రీరామచంద్రుని పాత్రలో ప్రభాస్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుగుతోంది. అప్పుడు రామలక్ష్మణులు సెల్ఫీ తీసుకున్నారు. అదేనండీ... రాముడిగా నటిస్తున్న ప్రభాస్‌, ఇందులో లక్ష్మణుడిగా కనిపించనున్న సన్నీసింగ్‌. వాళ్లిద్దరితో పాటు దర్శకుడు ఓం రౌత్‌ కూడా సెల్ఫీలో ఉన్నారు. ఈ సినిమాలో సీతగా కృతీ సనన్‌, లంకేషుడి (రావణుడి)గా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఆదివారం సైఫ్‌ ఫ్యామిలీకి ప్రభాస్‌ బిర్యానీ పంపించారు.


బాహుబలి బిర్యాని పంపిస్తే...

రుచికరమైన వంటకాలతో సహనటులకు మంచి విందు ఇవ్వడం ప్రభాస్‌కు అలవాటు. ఆయన పంపిన బిర్యానీ బావుందని సైఫ్‌ అలీ ఖాన్‌ సతీమణి, కథానాయిక కరీనా కపూర్‌ సామాజిక మాధ్యమాల్లో తెలిపారు. ‘బాహుబలి బిర్యాని పంపించాడంటే కచ్చితంగా బెస్ట్‌ అయి ఉంటుంది. అద్భుతమైన భోజనం పంపారు’ అని ఆమె పేర్కొన్నారు.