Sep 27 2021 @ 23:46PM

ఆదిపురుషుడి ఆగమనం ఎప్పుడంటే?

ఆదిపురుషుడిగా వచ్చే ఏడాది ఆగస్టులో ప్రభాస్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓం రౌత్‌ దర్శకుడు. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. హిందీ సహా దక్షిణాది భాషలు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో వచ్చే ఏడాది ఆగస్టు 11న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు భూషణ్‌కుమార్‌, కృషణ్‌కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ తెలిపారు. ప్రస్తుతం ముంబైలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో శ్రీరామునిగా ప్రభాస్‌, సీతగా కృతీ సనన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, లంకేషుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఆదిపురుషుడిగా ప్రభాస్‌ ఆహార్యం, నటన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని... రామాయణాన్ని దర్శకుడు ఓం రౌత్‌ సరికొత్తగా తెరకెక్కిస్తున్నారని చిత్రవర్గాల సమాచారం.