May 7 2021 @ 00:05AM

పూజారిగా ఆదిత్య ఓం!

హీరో ఆదిత్య ఓం పూజారిగా నటిస్తున్న చిత్రం దహనం. విశాఖపట్నం సమీప ప్రాంతాల్లో జరిగిన షూటింగ్‌తో ఈ చిత్రం దాదాపు పూర్తయింది. కొందరు వ్యాపారవేత్తలు గుడిని కబ్జా చేయటానికి ప్రయత్నిస్తే- వారి నుంచి ఆ గుడిని పూజారి ఎలా రక్షించాడనేదే ఈ చిత్ర కథ. ఓపెన్‌ ఫీల్డ్‌ పతాకంపై డాక్టర్‌ పి. సతీష్‌ కుమార్‌, డాక్టర్‌ ఆర్‌. బలరాం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎడారి మూర్తిసాయి ఈ చిత్రానికి దర్శకుడు.