క‌రోనా మృత‌దేహాల అంత్య‌క్రియ‌ల‌పై యూపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం

ABN , First Publish Date - 2021-05-08T18:10:08+05:30 IST

కరోనా వైరస్ బాధితులు, మృతుల సంఖ్య...

క‌రోనా మృత‌దేహాల అంత్య‌క్రియ‌ల‌పై యూపీ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం

లక్నో: కరోనా వైరస్ బాధితులు, మృతుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. అయిన‌వారు మృతి చెంద‌డంతో బాధిత కుటుంబాలవారు దిక్కుతోచ‌ని స్థితిలో చిక్కుకుంటున్నారు. ఈ ప‌రిస్థితుల‌ను గ‌మినించిన యూపీలోని యోగి సర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా వైరస్ కార‌ణంగా మృతి చెందిన‌వారికి ఉచితంగా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్ర‌కటించింది. 


ఉన్న‌తాధికారుల స‌మీక్షా స‌మావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అదనపు ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ అన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, పౌర సంస్థల అధికారుల‌కు వారు ఈ మేర‌కు చేయాల్సిన విధుల‌ను తెలియ‌జేశారు. కోవిడ్ -19 కారణంగా ఎవరైనా మృతి చెందిన సంద‌ర్భంలో వారి కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి, ఆ మృతదేహాలకు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని అధికారుల‌కు తెలియ‌జేశారు. ఈ ప్రక్రియలో కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించాల‌ని సూచించారు.

Updated Date - 2021-05-08T18:10:08+05:30 IST