Oct 21 2021 @ 11:52AM

Adivi Sesh : తిరిగి రంగంలోకి..

టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్ .. ఇటీవల డెంగ్యూ ఫీవర్ తో తీవ్రంగా బాధపడిన సంగతి తెలిసిందే. ప్లేట్ లెట్స్ దారుణంగా పడిపోవడంతో ఆయన అప్పటికప్పుడు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. కొద్ది రోజులు ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత డిస్చార్జ్ అయ్యారు. ఇప్పుడు శేష్.. ‘మేజర్’ సినిమా ఫైనల్ షూట్ కోసం తిరిగి రంగంలోకి దిగుతున్నారు. బాడీ ఫిట్ నెస్ కోసం ఆయన ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు. తన కండరాల్ని పూర్వపు స్థితికి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. తన కెరిర్ లో మేజర్ సినిమా చేయడం మేజర్ అచీవ్ మెంటని భావిస్తున్న ఆయన ఈ సినిమా కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపారు శేష్.  తిరిగి ఎవరొస్తున్నారో ఊహించండి? గెటింగ్ బ్యాక్ ఇన్ టు షేప్ ఫర్ ‘మేజర్’ మూవీ అనే వ్యాఖ్య జతచేసి.. అస్పష్టంగా కనిపిస్తోన్న తన కసరత్తుల ఫోటోను, దానికి సంబంధించిన వీడియో ను షేర్ చేశారు. 


 

కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ‘మేజర్’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘ముంబై’ తాజ్ హోటల్ లో జరిగిన బాంబ్ పేలుళ్ల నేపథ్యంలో సాగే ఈ సినిమాకి శశి కిరణ్ తిక్క దర్శకుడు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లో సైతం విడుదల కానున్న ఈ సినిమాలో ముంబై బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇదివరకు విడుదలైన ‘మేజర్’ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే బ్యాలెన్స్ పార్ట్ షూట్ చేసి వచ్చే ఏడాది ప్రధమార్ధంలో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.