‘రేషన్‌’ అప్పీల్‌పై విచారణ 1కి వాయిదా

ABN , First Publish Date - 2021-02-25T09:12:36+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సోమవారాని(ఒకటో తేదీ)కి వాయిదా పడింది. ఈ నెల 21తో గ్రామీణ ప్రాంతాల్లో

‘రేషన్‌’ అప్పీల్‌పై విచారణ 1కి వాయిదా

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్‌ పంపిణీ వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ సోమవారాని(ఒకటో తేదీ)కి వాయిదా పడింది. ఈ నెల 21తో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు ముగిశాయని.. ఈ నేపథ్యంలో ఈ అప్పీల్‌పై విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందో లేదో ఎస్‌ఈసీతో  చర్చించి.. వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు కొంత సమయం కావాలని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ బుధవారం హైకోర్టును కోరారు. అందుకు సమయం ఇస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Updated Date - 2021-02-25T09:12:36+05:30 IST