శాస్ర్తీయ పద్ధతిలో సర్దుబాటు చేయండి

ABN , First Publish Date - 2021-12-02T06:12:55+05:30 IST

నగరపాలక సంస్థలో ఉపా ధ్యాయులను శాస్ర్తీయ మైన పద్ధతిలో సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.

శాస్ర్తీయ పద్ధతిలో సర్దుబాటు చేయండి
నగరపాలక సంస్థ సెక్రటరీకి వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు


- సెక్రటరీకి ఉపాధ్యాయ సంఘాల వినతి

అనంతపురం కార్పొరేషన,డిసెంబరు1 : నగరపాలక సంస్థలో ఉపా ధ్యాయులను శాస్ర్తీయ మైన పద్ధతిలో సర్దుబాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. ఈ మేరకు బుధవారం కార్పొరేషన సెక్రటరీ సంగం శ్రీని వాసులును నాయకులు ఆయన చాంబర్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యూపీ పాఠశాలల్లో డిప్యుటేషనపై ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లను తిరిగి ఉన్నత పాఠశాలల్లో నియమించి, వారి  స్థానంలో యూపీ పాఠశాలల కు ఎస్‌జీ ఉపాధ్యాయులను కేటాయించాలని కోరారు. ఎస్‌కేడీ ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలిపినందున హైస్కూల్‌లోని  ప్రాథమిక పాఠశాల ఉపాధ్యా యులను 3,4,5 తరగతులకు కేటాయించాలన్నారు. హైస్కూల్‌కు స్కూల్‌ అసిస్టెంట్లను వేయాల న్నారు. డిసెంబరు1 వతేదీ నాటికి చైల్డ్‌ఇన్ఫోలో ఉన్న విద్యార్థుల సంఖ్యను  పరిగణనలోకి తీసు కోవాలని  కోరారు. ఉపాధ్యాయు లందరినీ కలిపి సీనియార్టీ జాబితా తయారు చేయాలన్నారు. ప్ర ధానోపా ధ్యాయులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, 81మందికి పైగా విద్యార్థులున్న పాఠశాల లకు ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో అదనంగా ఉన్న సబ్జెక్టు టీచర్లను ఇతర ఉన్నత పాఠశాలలకు కేటాయించాలని కోరారు. సెక్రటరీని కలిసిన వారిలో ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, ఫణిభూషణ్‌, ఎంటీఎఫ్‌ రమానా యక్‌, ఓబుళేసు, ఎస్‌సీఎస్‌టీయూఎస్‌ పెద్దన్న, యూటీఎఫ్‌ శ్రీనివాసులు, ఆర్‌యూ పీపీ తులసిరెడ్డి, ఆర్‌జేయూపీ రామాంజనేయులు, ఏపీటీఎఫ్‌ సాయప్ప, ఏపీటీఎఫ్‌ శ్రీనివాసులు, మురళీకృష్ణ, రామాంజనేయులు పాల్గొన్నారు. 

హెచ్‌ఎం, స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీలు అన్నీ చూపాలి    

అనంతపురం విద్య, డిసెంబరు 1 : ఉద్యోగోన్నతుల నేప థ్యంలో ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీలు అన్నీ చూపాలని వైఎస్‌ఆర్‌ టీఎఫ్‌ నాయకులు ఆర్‌జేడీ వెంకటక్రిష్ణా రెడ్డిని కోరారు.  ఆ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఓబుళపతి, ఇత ర నాయకులు కడపలో ఆర్‌జేడీని బుధవా రం కలిశారు.  ఈ నెల 11నుంచి ఉద్యోగోన్నతులు నిర్వహిస్తున్న నేపథ్యంలో నవంబరు 30 వరకూ ఏర్పడిన ఖాళీలను అన్నింటినీ చూపాల న్నారు. ఉద్యో గోన్నతులు పారదర్శకంగా జరిగేలా కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లా విద్యాశాకాధికారులకు సూచనలి వ్వాలన్నారు. సమస్యలపై ఆర్‌జేడీకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్య క్షుడు గిరిధర్‌రెడ్డి, కోశాధికారి రాజమోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధానకార్యదర్శి విశ్వనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-02T06:12:55+05:30 IST