Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏపీలో మద్యంపై పన్ను రేట్ల సవరింపు

అమరావతి: రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విలువ ఆధారంగా పన్నులో మార్పులు చేసింది. రూ.400 ధరలోపు ఉన్న బ్రాండ్లకు 50 శాతం మేర వ్యాట్‌ విధించింది. రూ.400 నుంచి రూ.2,500 వరకు ధర ఉన్న మద్యం కేసుకు 60 శాతం వ్యాట్‌‌ను అమలు పరిచింది. రూ.3,500 నుంచి రూ.5,000 ధర ఉన్న మద్యం కేసుకు 50 శాతం వ్యాట్‌ విధించింది. రూ.5,000 ఆపై ధర పలికే మద్యం కేసుపై 45 శాతం వ్యాట్‌ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రూ.200 కంటే ఎక్కువ ధర ఉన్న బీర్‌ కేసుపై 60 శాతం వ్యాట్‌‌ను విధించింది. ఇక అన్నిరకాల మద్యంపై 35 శాతం వ్యాట్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రెడీ టూ డ్రింక్‌ వెరైటీలపై కూడా 50 శాతం వ్యాట్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement
Advertisement