ఆదిత్యుని వార్షిక కల్యాణోత్సవాలకు శ్రీకారం

ABN , First Publish Date - 2021-04-20T05:28:00+05:30 IST

ప్రత్యక్ష దైవం ఆదిత్యుని వార్షిక కల్యాణోత్సవాలకు సోమవారం సాయంత్రం 6.30 గంటలకు అంకురార్పణ జరిగింది. పతాకావిష్కరణ, సకల దేవతాహ్వానం, దిగ్బలి, విశేష అర్చన, హారతి తదితర కార్యక్రమాలు ప్రధానర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఆదిత్యుని వార్షిక కల్యాణోత్సవాలకు శ్రీకారం
ధ్వజస్తంభం వద్ద పూజలు చేస్తున్న అర్చకులు

గుజరాతీపేట : ప్రత్యక్ష దైవం ఆదిత్యుని వార్షిక కల్యాణోత్సవాలకు సోమవారం సాయంత్రం 6.30 గంటలకు అంకురార్పణ జరిగింది. పతాకావిష్కరణ, సకల దేవతాహ్వానం, దిగ్బలి, విశేష అర్చన, హారతి తదితర కార్యక్రమాలు ప్రధానర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నెల 22న సాయంత్రం 7 గంటలకు సుగంధ ద్రవ్య మర్ధన (కొట్నం దంపు), 23న సాయంత్రం 7 గంటలకు స్వామివారిని వెండి అశ్వ వాహనాలపై తిరువీధి నిర్వహించనున్నట్టు ఆయన తెలి పారు. అనంతరం రాత్రి 9 గంటలకు స్వామివారి కల్యాణం ఉంటుందన్నారు. ఆలయ అనివెట్టి మండపంలోను, గరుడ ధ్వజస్తంభాల వద్ద ప్రత్యేక అలంకరణ ఏర్పాట్లు చెప్పారు. రూ.500 చెల్లించి రశీదు పొందిన భక్తుల గోత్రనామాలతో కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు.  


Updated Date - 2021-04-20T05:28:00+05:30 IST