నాపై అంత ప్రేమ ఉంటే... ఓ పేద కుటుంబం బాధ్యత తీసుకోండి

ABN , First Publish Date - 2020-04-09T08:11:49+05:30 IST

‘‘ప్రధాని మోదీ దేశానికి చేస్తున్న సేవకు గాను ఆదివారం సాయంత్రం 5 గంటలకు అంద రూ ఐదు నిమిషాలపాటు నిలబడి అయనను గౌరవించాలి’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్ర చారాన్ని...

నాపై అంత ప్రేమ ఉంటే... ఓ పేద కుటుంబం బాధ్యత తీసుకోండి

  • 5 నిమిషాలు నిలబడాలన్న ప్రచారంపై మోదీ


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: ‘‘ప్రధాని మోదీ దేశానికి చేస్తున్న సేవకు గాను ఆదివారం సాయంత్రం 5 గంటలకు అంద రూ ఐదు నిమిషాలపాటు నిలబడి అయనను గౌరవించాలి’’ అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్ర చారాన్ని మోదీ ఖండించారు. ఈ ప్రచారం తనను వివాదాల్లోకి లాగడానికి చేస్తున్న ప్రయత్నంలా ఉందని బుధవారం వ్యాఖ్యానించారు. ‘‘మీకు నిజంగా నాపై ప్రేమ, గౌరవం ఉంటే మీ వంతుగా ఒక పేద కుటుంబం బా ధ్యతలను తీసుకోండి. కనీసం కరోనా ప్రభావం తగ్గేవరకైనా ఆ పనిచేయండి. అంతకన్నా గొప్ప గౌరవం ఇంకొకటి లేదు’’ అని ఆయన ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-04-09T08:11:49+05:30 IST