Abn logo
Sep 20 2021 @ 03:30AM

అడ్వెంట్‌ చేతికి యురేకా ఫోర్బ్స్‌

డీల్‌ విలువ రూ.4,400 కోట్లు 

ముంబై: షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ కంపెనీ యురేకా ఫోర్బ్స్‌ చేతులు మారుతోంది.  అమెరికా కేంద్రంగా పని చేసే ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థ అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ రూ.4,400 కోట్లకు ఈ కంపెనీని కొనుగోలు చేయబోతోంది. ఇందుకోసం ఎస్‌పీ గ్రూప్‌ ముందుగా యురేకా ఫోర్బ్స్‌ను ప్రత్యేక కంపెనీగా విడగొట్టి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తుంది. ఆ తర్వాత ఆ కంపెనీ ఈక్విటీలో 72.56 శాతం వాటాను అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌కు కేటాయిస్తుంది. మిగతా మొత్తాన్ని అడ్వెంట్‌ ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేస్తుంది. యురేకా ఫోర్బ్స్‌ కంపెనీ యురేకా పేరుతో వాటర్‌ ప్యూరిఫైర్స్‌, క్లీనర్లు తయారు చేసి మార్కెట్‌ చేస్తోంది. అప్పుల భారం తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఎస్‌పీ గ్రూప్‌.. యురేకా ఫోర్బ్స్‌ను విక్రయిస్తోంది.