తన విడాకుల కేసుని వాదించిన లాయర్‌పైనే కేసు పెట్టిన మహిళ.. ఆ లాయర్ ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-24T09:08:00+05:30 IST

ఒక మహిళ తన విడాకుల కేసు వాదించిన లాయర్‌పైనే అత్యాచారం కేసు పెట్టింది. కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాక.. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకున్నడాని.. ఆ తరువాత పెళ్లి చేసుకోనని మోసం చేశాడని..

తన విడాకుల కేసుని వాదించిన లాయర్‌పైనే కేసు పెట్టిన మహిళ.. ఆ లాయర్ ఏం చేశాడంటే..

ఒక మహిళ తన విడాకుల కేసు వాదించిన లాయర్‌పైనే అత్యాచారం కేసు పెట్టింది. కోర్టు ద్వారా విడాకులు ఇప్పించాక.. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకున్నడాని.. ఆ తరువాత పెళ్లి చేసుకోనని మోసం చేశాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ నగరంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. ఇందోర్ నగరానికి చెందిన ప్రతాప్ సింగ్(పేరు మార్చబడినది) అనే లాయర్ 2018లో స్వప్న(పేరు మార్చబడినది) అనే యువతి విడాకుల కేసు వాదించాడు. ఆ కేసు రెండు సంవత్సరాల వరకు సాగింది.  కేసు జరిగే సమయంలో స్వప్నకు ప్రతాప్ సింగ్‌ల మధ్య ఉన్న పరిచయం ప్రేమగా మారింది. 2020లో స్వప్నకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. స్వప్న సమీపంలో ఉన్న గ్రామంలో నివసించేది. విడాకుల తరువాత ప్రతాప్ సింగ్ ఆమెను ఇందోర్ నగరానికి తీసుకువచ్చేశాడు.


నగరంలో స్వప్నకు ఒక అద్దె ఇల్లు, ఒక ఉద్యోగం కూడా ఇప్పించాడు. ప్రతాప్ సింగ్ తన భార్యకు విడాకులు ఇచ్చేశానని.. త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటానని స్వప్నను నమ్మించి.. ఆమెతో రోజూ శృంగారం చేసేవాడు. కొన్ని రోజుల తరువాత స్వప్న తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ప్రతాప్ సింగ్‌పై ఒత్తిడి చేసింది. కానీ అతను మాత్రం పెళ్లి మాట ఎత్తగానే మాట దాటేశాడు. కానీ ఒకరోజు ఈ విషయమై స్వప్న గొడవ చేసింది. దీంతో ప్రతాప్ ఆమెను పెళ్లి చేసుకునేది లేదని చెప్పేశాడు.


తాను మోసపోయానని గ్రహించిన స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు లాయర్ ప్రతాప్ సింగ్‌పై చీటింగ్, అత్యాచారం కేసులు నమోదు చేసి అరెస్టు చేయడానికి వెళ్లగా.. అతను పరారీలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం పోలసులు అతని కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-01-24T09:08:00+05:30 IST