Abn logo
Sep 23 2021 @ 00:45AM

అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ అమలు చేయాలి

వేములవాడలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

 వేములవాడ, సెప్టెంబరు 22 : న్యాయవాదుల రక్షణ కోసం తక్షణమే అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను అమలు చేయాలని వేములవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పిట్టల భూమేశ్‌ డిమాండ్‌ చేశారు. ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది గడ్డం సంజీవ్‌పై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా బుధవారం వేములవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా పిట్టల భూమేశ్‌ మాట్లాడుతూ పేదల పక్షాన వాదిస్తున్న న్యాయవాదులపై రోజు రోజుకూ దాడులు పెరుగుతున్నాయన్నారు. న్యాయ వ్యవస్థపై దాడి అంటే ప్రజాస్వామ్యంపైనే దాడి అని, వెంటనే అడ్వకేట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను అమలులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్‌గౌడ్‌, గోపీకృష్ణ, వేముల సుధాకర్‌, గుండ రవి, కొడిమ్యాల పురుషోత్తం, పొత్తూరి అనిల్‌, బొడ్డు ప్రశాంత్‌, గుడిసె సదానందం, అవదూత రజనీకాంత్‌, అన్నపూర్ణ  పాల్గొన్నారు.