బాబోయ్‌! ఈ టార్చర్ భరించలేనుంటూ భార్యపై కేసు పెట్టిన భర్త.. 16 నెలల క్రితం కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నా..

ABN , First Publish Date - 2021-10-27T06:33:06+05:30 IST

భార్యలను వేధించే భర్తలే కాదు. భర్తను వేధించే భార్యలు కూడా ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా..

బాబోయ్‌! ఈ టార్చర్ భరించలేనుంటూ భార్యపై కేసు పెట్టిన భర్త.. 16 నెలల క్రితం కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నా..

లక్నో: భార్యలను వేధించే భర్తలే కాదు. భర్తను వేధించే భార్యలు కూడా ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో చాలా బయటపడుతున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో బయటపడింది. ఓ దివ్యాంగుడైన ఏఈ.. తనను భార్య, అత్తమామలు తెగ హింసిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌కి ఎక్కాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలీఘడ్‌లొని ఖాసింపురా కాలనీ ఏఈ.. తాను దివ్యాంగుడినని, గతేడాది జూన్ 30న ఆగ్రాకు చెందిన సప్నా పుత్రి శిశుపాల్‌తో జరిగిందని చెప్పారు. ఒక్క రూపాయి కూడా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానని, తామిద్దరికీ ఓ పాప కూడా పుట్టిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ కొద్ది కాలంగా తన భార్య తనపై అఘాయిత్యాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. తన కుటుంబంతో కలిసి బెదిరించడంతో పాటు ప్రాణాలు కూడా తీస్తానని బెదిరించినట్లు ఆరోపించాడు. కొద్ది రోజుల క్రితం ఇంట్లోని నగదు, ఆభరణాలతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయిందని, అయితే తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను ఇంటికి తిరిగి తీసుకొచ్చేందుకు వారి ఇంటికి వెళ్లగా.. అవమానించి పంపేశారు.


 ‘కొన్నిరోజులకు నా భార్య తన తండ్రితో పాటు.. మరికొందరితో కలిసి ఇంటికొచ్చింది. అయితే ఆమెతో ఇంటికొచ్చిన ఇద్దరూ నన్ను బూతులు తిట్టి కొట్టారు. దీంతో వెంటనే పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి విషయం వివరించాను’ అని బాధితుడు పేర్కొన్నారు. బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్ అధికారి జితేండ్ర సింగ్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. బాధితుడి ఫిర్యాదు మేరకు అతడి భార్య సప్న, ఆమె  తండ్రి శిశుపాల్, సోదరి అనుష్క, మరో ఇద్దరు అపరిచితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దర్యాప్తు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-10-27T06:33:06+05:30 IST