మట్టి తవ్వకాలు నిలుపుదల

ABN , First Publish Date - 2021-06-14T06:03:50+05:30 IST

తీర ప్రాంతంలోని పిరాట్లంక కృష్ణా కరకట్ట వెంబడి అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్దంగా మట్టి తవ్వకాలపై ఆంధ్రజ్యోతిలో ఈనెల 5వ తేదీన యథేచ్ఛగా మట్టి తవ్వకాలు, స్పందించని అధికారులు అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.

మట్టి తవ్వకాలు నిలుపుదల
పిరాట్లంకవద్ద తవ్వకాలను ఆపివేయాలని ఆదేశాలిస్తున్న ఆర్‌సీ ఏఈ నాగేశ్వరనాయక్‌

ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

రేపల్లె, జూన్‌ 13: తీర ప్రాంతంలోని పిరాట్లంక కృష్ణా కరకట్ట వెంబడి అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్దంగా మట్టి తవ్వకాలపై ఆంధ్రజ్యోతిలో ఈనెల 5వ తేదీన యథేచ్ఛగా మట్టి తవ్వకాలు, స్పందించని అధికారులు అనే శీర్షికన  కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ఆర్‌సీ అధికారులు స్పందించారు. ఆదివారం అక్రమ మట్టి తవ్వకాలు నిలుపుదల చేయించారు. ఈ సందర్భంగా కృష్ణా రివర్‌ అథారిటీ ఎఈ నాగేశ్వరనాయక్‌ మాట్లాడుతూ పట్టా భూముల్లో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా తవ్వకాలు జరిపినమాట వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా నది కరకట్ట వెంబడి నది ఒడ్డున ఎవరైనా మట్టి తవ్వకాలు జరిపితే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2021-06-14T06:03:50+05:30 IST