తిండి కోసం కూతుళ్లను అమ్ముకుంటున్న అఫ్ఘానీలు..!

ABN , First Publish Date - 2021-11-03T03:36:31+05:30 IST

తాలిబన్ల పాలనలో అఫ్ఘానిస్థాన్ మానవసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తిండి గింజలు లేక కొందరు తమ కుటుంబంలోని ఆడబిడ్డల్ని అమ్ముకుంటున్నారు.

తిండి కోసం కూతుళ్లను అమ్ముకుంటున్న అఫ్ఘానీలు..!

ఇంటర్నెట్ డెస్క్: తాలిబన్ల పాలనలో అఫ్ఘానిస్థాన్ మానవతాసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తిండి గింజలు లేక కొందరు తమ కుటుంబంలోని ఆడబిడ్డల్ని అమ్ముకుంటున్నారు. ఒకప్పుడు కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే కనిపించే ఈ దృశ్యాలు ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఇళ్లలోని మగాళ్లకు బయట ఎక్కడా పని దొరక్క కుటుంబాన్ని పోషించుకునేందుకు వారు 10 ఏళ్లు కూడా నిండని ఆడపిల్లల్ని అమ్ముతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం ఏర్పడ్డాక అంతర్జాతీయ నిధుల రాకడ దాదాపుగా నిలిచిపోయింది. ఉద్యోగులకు జీతాలు కూడా అందట్లేదు. మరోవైపు..ఆహార కొరత, నిత్యావసర వస్తువుల పెరుగుదల అక్కడి వారిని నరకంలోకి నెట్టేస్తోంది. ఇటువంటి సందర్భంలో అనేక కుటుంబాలు చిన్నారులను పెళ్లి పేరిట్ అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి బాల్యవివాహాలు అక్కడ గతంలోనూ జరిగినప్పటికీ..ఇటీవల కాలంలో మరింతగా పెరిగాయని పరిశీలకులు చెబుతున్నారు. 

Updated Date - 2021-11-03T03:36:31+05:30 IST