Advertisement
Advertisement
Abn logo
Advertisement

Viral Video: నేను పుట్టింది అందుకోసం కాదు.. Afghan అమ్మాయి సంచలన వ్యాఖ్యలు..

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా దళాలు అఫ్ఘాన్ నుంచి వెనుదిరిగాయి. ఈ క్రమంలో ఆ దేశం పూర్తిగా తాలిబన్ల వశమైంది. దీంతో మహిళల హక్కులు ప్రస్తుతం అక్కడ ప్రశ్నార్థకం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే మహిళల హక్కుల ప్రాముఖ్యతపై ఓ అమ్మాయి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అప్ఘానిస్థాన్‌ను తమ గుప్పిట్లోకి తీసుకున్న తాలిబన్లు.. తాజాగా కీలక ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలను తిరిగి ఓపెన్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా కేవలం బాలురు మాత్రమే విద్యాలయాలకు వెళ్లి చదువుకోవాలని స్పష్టం చేశారు. చదువుకునేందుకు  విద్యార్థినులను అనుమతించలేదు. విద్యార్థినులను విద్యాలయాల్లోకి అనుమతించే అంశాన్ని పరిశీలిస్తున్నామని.. దీనికి సంబంధించి త్వరలోనే ఓ ప్రకటన విడుదల చేస్తామంటూ పేర్కొన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థునులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. ఓ జర్నలిస్ట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 


ఆ వీడియో ఓ అమ్మాయి మాట్లాడుతూ.. ‘దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం అనేది గొప్ప అవకాశం. పురుషులతో పాటు మహిళలకు కూడా అల్లా సమాన అవకాశాలు, హక్కులను ఇచ్చారు. దీన్ని కాదనడానికి తాలిబన్లు ఎవరు?. నేటి బాలికలే.. భవిష్యత్తులో తల్లులుగా మారుతారు. ఇప్పుడు బాలికలకు సరైన విద్య అందకపోతే.. భవిషత్తులో తమ పిల్లలకు మంచి చెడులను ఎలా చెబుతారు. నేను ఈ తరం అమ్మాయిని, ఇంటి దగ్గరే ఉంటూ కేవలం తిని, పడుకోవడానికే పుట్టలేదు. నేను స్కూలుకు వెళ్లాలనుకుంటున్నాను. దేశ అభివృద్ధిలో భాగం కావాలనుకుంటున్నాను. ఎడ్యుకేషన్ లేకుండా ఏ దేశమైనా ఎలా అభివృద్ధి చెందుతుంది. బాలికలకు విద్య అందకపోతే.. రేపు మంచి సమాజం ఎలా నిర్మితం అవుతుంది. ఒకవేళ మేము చదువుకోకపోతే.. ప్రపంచంలో మాకు విలువ ఉండదు’ అంటూ వ్యాఖ్యానించింది. కాగా.. ప్రస్తుతం ఆ అమ్మాయికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్టపి వరకు ఈ వీడియోను 66వేల మంది వీక్షించారు. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు ఆ అమ్మాయిని ప్రశంసిస్తూ కామెంట్ చేస్తున్నారు. 



ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement