ఆఫ్ఘన్ ప్రభుత్వంలో స్థానం కోసం మహిళల నిరసన

ABN , First Publish Date - 2021-09-02T21:53:32+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో తదుపరి ఏర్పడే ప్రభుత్వంలో మహిళలకు

ఆఫ్ఘన్ ప్రభుత్వంలో స్థానం కోసం మహిళల నిరసన

హెరాత్ : ఆఫ్ఘనిస్థాన్‌లో తదుపరి ఏర్పడే ప్రభుత్వంలో మహిళలకు స్థానం కల్పించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మహిళా హక్కుల కార్యకర్తలు ఇప్పటి వరకు సాధించిన విజయాలకు తెర పడకూడదనే లక్ష్యంతో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 


ఆఫ్ఘనిస్థాన్ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం హెరాత్ నగరంలో పెద్ద సంఖ్యలో మహిళలు ధర్నా నిర్వహించారు. మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వోద్యోగాలు చేసే మహిళలు, విద్యార్థినులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తదుపరి ప్రభుత్వంలో తమ హక్కులను కాపాడుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘‘మహిళలు లేనిదే ఏ ప్రభుత్వమూ కొనసాగదు’’, ‘‘మహిళలను ప్రభుత్వంలో చేర్చుకోవాలి’’ అని రాసి ఉన్న బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించారు. 


ఇదిలావుండగా, తాలిబన్ల మధ్య అంతర్గత కలహాలకు తెరపడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వాధినేతగా తాలిబన్ల అగ్ర నేత హైబతుల్లా అకుండ్‌జాదా నియామకానికి తాలిబన్ల వర్గాల మధ్య సయోధ్య కుదిరినట్లు సమాచారం. 


Updated Date - 2021-09-02T21:53:32+05:30 IST