పారిపోయే Afghan ప్రజలకు వీళ్లు సాయం చేస్తున్నారు

ABN , First Publish Date - 2021-11-10T00:49:43+05:30 IST

అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ తాజాగా ప్రచురించిన కథనం ప్రకారం.. జరంగ్ పట్టణం నుంచి కార్లలో ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దులకు ప్రజలను తరలిస్తున్నారని రాసుకొచ్చారు. ఒక్కో కారులో 18-20 మందిని తరలిస్తున్నారట..

పారిపోయే Afghan ప్రజలకు వీళ్లు సాయం చేస్తున్నారు

కాబూల్: అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల కష్టాలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా దేశంలో ఆర్థికమాంద్యం వల్ల అఫ్ఘనీలకు ఆకలి బాధలు ఎదురవుతున్నాయి. దీంతో చాలా మంది అఫ్ఘాన్‌ను వదిలి వెళ్తున్నారు. తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోని పరిస్థితిని గుర్తు చేసుకుంటే ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. ఇరాన్, పాకిస్తాన్‌లకు సరిహద్దులో ఉన్న జరంగ్ అనే పట్టణం నుంచి తాజాగా వలసలు జోరుగా సాగుతున్నాయి. వీరికి కొన్ని ఏజెన్సీలు సహాయం అందిస్తున్నాయి.


అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ తాజాగా ప్రచురించిన కథనం ప్రకారం.. జరంగ్ పట్టణం నుంచి కార్లలో ఇరాన్, పాకిస్తాన్ సరిహద్దులకు ప్రజలను తరలిస్తున్నారని రాసుకొచ్చారు. ఒక్కో కారులో 18-20 మందిని తరలిస్తున్నారట. తాలిబన్లకు కొద్ది మొత్తంలో డబ్బు అందజేస్తే ఇలా వెళ్లేందుకు అనుమతి లభిస్తుందట. విదేశాలకు వెళ్లి ఏదైనా పని చేసుకుని బతికేందుకు అఫ్ఘాన్‌లు తొందరపడుతున్నారని బీబీసీ పేర్కొంది.

Updated Date - 2021-11-10T00:49:43+05:30 IST