నిజాంలకు భయపడే.. ఆ పని చేయడం లేదు: బండి సంజయ్

ABN , First Publish Date - 2021-09-14T21:13:11+05:30 IST

మెదక్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్.. మాట తప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిజాం కుటుంబానికి భయపడే.. విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం

నిజాంలకు భయపడే.. ఆ పని చేయడం లేదు: బండి సంజయ్

మెదక్: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్పిన కేసీఆర్.. మాట తప్పారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిజాం కుటుంబానికి భయపడే.. విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా.. మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ మంత్రి బాబు మోహన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని.. మోదికి లేఖ రాసే దమ్ము, కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ వాళ్ళతో కేసీఆర్ చెప్పిస్తున్నాడని తెలిపారు.


ఓల్డ్ సిటీలో పోటీ చేసే దమ్ము టీఆర్ఎస్‌కు లేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి ఎప్పటికీ వెళ్ళరని చెప్పారు. రాష్ట్రంలో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితిలో లేరన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ముఖ్యమంత్రికి.. ఉద్యోగాలు, నోటిఫికేషన్‌లు గుర్తుకొస్తాయని విమర్శించారు. నిరుద్యోగ మృతి, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు ఎందుకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.  మళ్ళీ కొత్తగా పేద వారి బంధు అంటున్నారని ఎద్దేవాచేశారు. చరిత్రను.. కేసీఆర్ కనుమరుగు చేస్తున్నాడని మండిపడ్డారు. అమిత్‌షా నిర్మల్ సభను జయప్రదం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Updated Date - 2021-09-14T21:13:11+05:30 IST